AP: మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. 'రాష్ట్రంలోని కోటీ 43 లక్షల కుటుంబాల్లోని 4.30 కోట్ల మంది పేదలకు ఉచితంగా రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ. 2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని అందులో పేర్కొంది.