సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులైనా అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ క్రమంలో దుండగుడికి సంబంధించి తాజాగా మరో వీడియో వచ్చింది. దాడి అనంతరం ఉదయం 9 గంటలకు అతను బ్లూ కలర్ షర్టులో ఓ షాప్‌లో ఇయర్ ఫోన్స్ కొంటున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత బాంద్రా స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి పారిపోయాడు. కాగా, పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.