బాల్యంలో యాంటీ బయాటిక్స్‌ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు

61చూసినవారు
బాల్యంలో యాంటీ బయాటిక్స్‌ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు
ఔషధ చికిత్సలో శక్తిమంతమైన అస్త్రం యాంటీబయాటిక్స్‌. వాటిని అవసరం లేకున్నా పసి వయసులో వాడితే చిన్నారులు ఉబ్బసం (ఆస్తమా) బారినపడతారు. బాల్యంలో యాంటీ బయాటిక్స్‌ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతోంది, దాని ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉంటుందనే కోణంలో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2.60 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్