తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. 1940-44 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్‌ముఖ్, రజాకర్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.