ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో సీఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు మరో రూ.2,723 కోట్లు కేటాయిస్తూ సీఎం ఆమోదం తెలిపారు. అలాగే, జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పంపిణీ ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు.