ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం సచివాలయంలో జరిగింది. రాష్ట్రంలో గడచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి పురోగతిపై చర్చించారు. గతంలో జరిగిన ఒప్పందాలు, వాటి స్థితిగతులపైనా ఆరా తీశారు. ఎస్ఐపీబీ తొలి సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 34 వేల ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.