ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చిలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్

85చూసినవారు
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. కొచ్చిలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్
బెంగళూరు నుంచి మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ ఈ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.21గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్