మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన జరిగింది. మౌగంజ్ జిల్లాలోని హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు కలిసి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అంబులెన్స్‌లో ఎక్కించుకొని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 25న ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.