పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందా?

70చూసినవారు
పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందా?
వండిన వాటిల్లో కంటే పచ్చి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం వండే సమయంలో కొన్ని పోషకాలు నాశనమవుతాయి. పచ్చి కూరగాయలతో ఈ బెడద ఉండదు. వీటిల్లో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. వీటిల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా దీర్ఘకాలిక రోగాలు దరిచేరవు. కెలొరీలు కూడా తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అత్యంత అనుకూలమైనవి. మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్