బేకరీ, ఫాస్ట్ ఫుడ్ ఆహార పదార్థాలలో ఎక్కువగా ట్రాన్స్ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే పొటాటో వెపర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్లో కూడా ట్రాన్స్ఫ్యాట్స్ అధికంగానే ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ట్రాన్స్ఫ్యాట్స్ అనేవి మన రోజువారి ఆహారంలో జీరోగా ఉండాలని సూచిస్తున్నారు. మార్కెట్లో దొరికే చాలా పిజ్జాలలో సోడియం అధికంగా ఉంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.