ఈ రోజుల్లో ప్రతీ ఒకరు ఎదుక్కొనే సమస్య స్ట్రెస్. పని చేసే చోట ఒత్తిడి.. ఆఫీసుల్లో, ఇంట్లో ఒత్తిడితో చాలామంది సతమతమవుతుంటారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. గులాబీరేకుల టీ తాగితే టెన్షన్‌లన్నీ తొలగిపోయి మనసు హాయిగా మారుతుంది. దీనిలోని ఎ,సి విటమిన్లు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. ఈ టీ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.