1901 తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు

64చూసినవారు
1901 తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని తెలిపింది. ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉండగా ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టింది. యూరోపియన్ వాతావరణ సంస్థ కొపర్నికస్ కూడా 2024ను గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్