అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత మరో వ్యాధితో బాధపడుతోంది. గతంలో సమంత సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ అక్కినేని కుటుంబంపై విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో అదే విషయాన్నీ ఓ యాంకర్ ఆమెను నేరుగా ప్రశ్నించగా.. తనకు లైట్ సెన్సిటివిటీ ఉందని సమంత పేర్కొంది. లైట్ ఫోక్సింగ్ తన కళ్లల్లో పడితే కన్నీళ్లు వస్తాయని, అంతే గానీ తానెప్పుడు వ్యక్తిగత కారణాలతో ఏడవనని చెప్పుకొచ్చింది.