కోత కోసిన వరి పనలు వర్షాలకు తడిస్తే గింజ మొలకెత్తకుండా ఉండడానికి లీటరు నీటికి 50 గ్రాములు ఉప్పు ద్రావణం పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలు తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోతే మడిలోనే పనలపై ఉప్పు నీరు చల్లవచ్చు. పొలంలో నీరు నిలిస్తే పనలను గట్టుపైకి తెచ్చి ఉప్పు ద్రావణం చల్లుకోవడం ద్వారా గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా నివారించవచ్చు. రంగు మారిపోయిన ధాన్యానికి మార్కెట్ ధర గణనీయంగా తగ్గిపోతుంది.