32 మందికి అర్జున్ అవార్డుల ప్రకటన

80చూసినవారు
32 మందికి అర్జున్ అవార్డుల ప్రకటన
క్రీడల్లో ప్రతిభ చాటిన పలువురికి కేంద్రం అర్జున్ అవార్డులను ప్రకటించింది. మొత్తం 32 మందికి అర్జున్ అవార్డులను ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి (విశాఖ), పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తికి (ఉమ్మడి వరంగల్) అర్జున్ అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ కాసేపటి క్రితం పేర్కొంది. వీరు ఈనెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్