వైసీపీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. హత్యాయత్నం కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. తనపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకూఆయనపై ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ప్రభుత్వానికి, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది.