ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు.