4 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఆశ వర్కర్ల నిరసన (వీడియో)

83చూసినవారు
TG: జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశ వర్కర్ల నిరసన చేపట్టారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదని వారు ఆందోళన చేస్తున్నారు. అందరికి ఒకటవ తేదీనే జీతాలు వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ.. గత 3,4 నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వట్లేదని కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కలెక్టరేట్ కు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డగించారు.