న్యూయార్క్ స్టేడియం కూల్చివేత

67చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌కు అతిథ్యమిచ్చిన న్యూయార్క్‌లోని నసావు స్టేడియాన్ని కూల్చివేస్తున్నారు. గురువారం జరిగిన భారత్-యూఎస్ఏ మ్యాచ్ అనంతరం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం మూడు నెలల్లో రూ.250 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉపయోగించారు. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లు లోయెస్ట్ టోటల్‌తోనే ముగిశాయి.

సంబంధిత పోస్ట్