బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన (video)

68చూసినవారు
వరంగల్ బస్టాండ్ నుంచి మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో సదరు మహిళ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో ఆటోలో బస్సును వెంబడించింది. రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. కాగా.. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

సంబంధిత పోస్ట్