ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా అశ్విన్‌

69చూసినవారు
ప్రపంచ నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా అశ్విన్‌
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బౌలర్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అశ్విన్‌ తన కెరీర్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించడం ఇది ఆరోసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్