భూమి వైపు '2024 PK2' అనే పేరున్న గ్రహ శకలం శరవేగంగా దూసుకొస్తోంది. కాసేపట్లో అర్ధరాత్రి 12 గంటల సమయానికి భూమికి అతి సమీపంలోకి ఇది రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. ఆ గ్రహ శకలం 83 అడుగుల పొడవు ఉందని, చిన్న సైజు భవనం అంత ఉంటుందని నాసా అంచనా వేసింది. భూమి నుంచి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి గ్రహశకలం వెళ్లనున్నట్లు పేర్కొంది.