TG: భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాటారం మండలానికి చెందిన హరిత డెలివరీ కోసం మండలంలోని PHCలో అక్టోబర్ 28న అడ్మిట్ అయింది. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పుల వస్తున్నా సర్జరీ చేయకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నించడంతో.. కడుపులోనే శిశువు మృతిచెందిందని బాధితురాలు తెలిపింది. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.