రాజస్థాన్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి అంతా షాకయ్యారు. జోధ్‌పూర్‌లోని పవోటా హాస్పిటల్‌లో దీపావళి సెలవుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఒక వార్డ్ బాయ్ యూట్యూబ్ చూసి రోగికి ఈసీజీ పరీక్ష నిర్వహించాడు. ఈ ఘటన అక్టోబరు 31న జరిగ్గా, వీడియోలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోగి, అతని బంధువులు వద్దని వారిస్తున్నప్పటికీ వార్డ్ బాయ్ వినకుండా తన ఫోన్‌ను చూస్తూ ఈసీజీ చేశాడు.