AP: కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కదలలేని స్థితిలో ఉన్న కన్నతల్లి తిరుపతమ్మను ఓ కసాయి కొడుకు పత్తికొండలోని కరెంటు ఆఫీస్ ఎదురుగా ఉన్న కాలనీలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కాలనీవాసుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తిరుపతమ్మను ప్రభుత్వాస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. కాగా, చనిపోయిన తండ్రి పింఛన్‌ను తన కొడుకు నొక్కేస్తూ అష్టాకష్టాలు పెడుతున్నాడని తిరుపతమ్మ తెలిపింది.