గొడవ జరగడంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసి పారిపోయిన భార్య

64చూసినవారు
గొడవ జరగడంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసి పారిపోయిన భార్య
గొడవ జరగడంతో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసి భార్య పరారైన ఘటన ఉత్తర ఢిల్లీలోని రూప్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన బాధితుడు విష్ణు కొన్ని నెలల క్రితమే తన భార్యతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. అయితే శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆవేశానికి లోనై తన భర్తపై కత్తితో దాడి చేసి అతని ప్రైవేట్ పార్ట్‌ను గాయపరిచింది. బాధితుడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్