వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సమీక్షలో రిషభ్ పంత్ ఔట్ అంటూ తీసుకున్న థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనది కాదని వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ ప్యాడ్‌కు బ్యాటు తాకడంతో అల్ట్రాఎడ్జ్‌లో రీడింగ్ చూపించిందని నెట్టింట్లో ఫ్రూప్స్ వెల్లువెత్తున్నాయి. మరో వైపు ఇదే విషయాన్ని మైదానంలోని అంపైర్లతో పంత్ వివరిస్తూ కన్నీటితో పెవిలియన్‌కు చేరాడు.