TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని కర్మన్ఘాట్కి చెందిన వీరనగరి జైపాల్(23) డిగ్రీని మధ్యలో ఆపేశాడు. దీంతో తన తండ్రి రాములు.. జైపాల్‌ని రోజు మందలించేవాడు. ఈ క్రమంలో తండ్రీకుమారులకు శుక్రవారం గొడవ జరగ్గా.. కోపంతో రాములు తన కొడుకుపై కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో గాయపడ్డ జైపాల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.