పెదాలు పలుగుతున్నాయా..?

55చూసినవారు
పెదాలు పలుగుతున్నాయా..?
చలికాలంలో పెదాలు పొడిగా మారి పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి లిప్‌బామ్ కూడా పని చేయదు. అలా కాకుండా ఉండాలంటే.. చలికాలంలో దాహంగా లేకపోయినా రెండు గంటలకొకసారి కనీసం గ్లాసు నీళ్లు తాగాలి. పేరిన నెయ్యి, వెన్న, కొబ్బరినూనె రాస్తుంటే పొడి బారకుండా ఉంటాయి. చెంచా చొప్పున పంచదార, తేనె, బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని రుద్దితే పెదాలపై మృత కణాలు తొలగి పగుళ్లు పోతాయి.

సంబంధిత పోస్ట్