సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై కావాలనే దాడి చేశారని MP ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. గుడిపై జరిగిన దాడిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిందితులను శిక్షించాలంటూ నిరసన తెలిపిన స్థానికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.