మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు అల్లరిమూకలు ప్రయత్నించడంతో శనివారం మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.