ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. అయితే ఆ తర్వాత కూడా కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లా కేంద్రాల మార్పు డిమాండ్లు, తమ నియోజకవర్గాల్ని పొరుగు జిల్లాల్లో కలపాలనే డిమాండ్ల వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఇలాంటి మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు.