AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. అయితే బాలిక అరుపులు విన్న బంధువులు యువకుల్లో ఒకర్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.