TG: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండలో కొందరు దుండగులు ఓ బాలిక (17)ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ దుండగులు బాలికను విడిచిపెట్టకపోగా, ఆటోడ్రైవర్‌పై దాడికి దిగారు. అయినా గాయపడ్డ ఆటోడ్రైవర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా బాలికను కాపాడి తన ఇంటి వద్ద క్షేమంగా దింపేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేయడంతో.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.