సా.5 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ

79చూసినవారు
సా.5 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ
AP: సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం ఆయన మాజీ ప్రధాని వాజ్‌పేయీ శత జయంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించనున్నారు. 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతలతో భేటీ కానున్నారు. సా.5 గంటలకు ప్రధాని మోదీతో, 6 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్