AP: యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని గుర్తు చేశారు. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతిని నింపాలని ఆయన ఆకాంక్షించారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను యేసుక్రీస్తు ప్రజలు అందించారని పేర్కొన్నారు.