బాబోయ్ ఇలాంటి పూజలెప్పుడూ చూడలేదు.. నిజమైన నాగుపాముకు అభిషేకం

61చూసినవారు
కొందరు పాములను నాగదేవతలా ఆరాధిస్తుంటారు. పండుగల రోజు వాటి ప్రతిమలకు పూజలు కూడా చేస్తారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఓ కుటుంబం తమ ఇంట్లో నాగపూజ చేస్తోంది. అయితే ఆ పుజాలో విగ్రహానికి కాకుండా..ఏకంగా నిజమైన నాగుపాముకు అభిషేకం చేశారు. ఆ క్రమంలో తనను ఏం చేస్తున్నారో అని భయపడి పాము బుసలు కొడుతూ వారిని భయపెట్టింది. ‘బాబోయ్ ఇలాంటి పూజలు ఎప్పుడూ చూడలేదు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్