బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం చేపలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి పద్మా నదిలో ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య మాత్రమే దొరికే ఇలిష్ , అకా, హిల్సా చేపల దిగుమతి నిలిచిపోయింది. దీంతో బెంగాలీ ప్రజలు ఆ వంట రుచికి దూరమయ్యారు. దౌత్య సంబంధాల్లో భాగంగా ప్రతీ ఏడాది మాజీ ప్రధాని షేక్ హసీనా పశ్చిమ బెంగాల్కు ఈ చేపలను పంపిస్తుండే వారు.