తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఒలింపిక్ సంఘానికి బీసీసీఐ భారీ ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు ఏకంగా రూ. 8.50 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. భారత అథ్లెట్లకు బీసీసీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశం గర్వించేలా క్రీడాకారులు కృషి చేయాలని కోరారు.