విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ఆగస్టు 29 నుంచి ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జియో ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 12, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.