వర్షా కాలంలో చర్మ సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ ఉసిరి జ్యూస్ తాగుతుంటే ఎంతో లాభం ఉంటుంది. ముడతలు పోగొట్టి, చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తికి ఉసిరి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంపై ఉండే నల్ల మచ్చలు, టాన్‌ను పోగొడుతుంది. హార్మోన్ల అసమతుల్యతను నివారించి మొటిమలు రాకుండా కాపాడుతుంది. రోజూ 4 ఉసిరి కాయల రసంలో తేనె, పసుపు కలిపి తాగితే ఫలితం ఉంటుంది.