బిందు సేద్యం చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మొక్కకు కావాల్సిన నీటిని బొట్టు బొట్టుగా అందిస్తుంది. దీనివల్ల సాధారణ పద్ధతితో పోల్చితే 30-50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఈపద్ధతి ద్వారా తేలికపాటి నేలలు లేదా నల్లరేగడి నేలలు, కొండ ప్రాంతాల్లో ఎంతో అనువుగా ఉంటుంది. దీని వలన ఖర్చు తగ్గుతుంది. బిందు సేద్యంలో ఎరువులు కూడా మొక్కలకు అందించవచ్చు. దీని ద్వారా కూలీల ఖర్చులను తగ్గించుకోవచ్చు.