పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉన్నదని వెల్లడైంది.