అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆరోగ్యం, వయోభార సమస్యలనే డెమోక్రాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల బహిరంగ వేదికలపై తన వింత ప్రవర్తనతో బైడెన్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా మరో పాత వీడియో వెలుగులోకి వచ్చింది. బైడెన్ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో ఉంది.