ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంగ్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి తక్కువ విలువ చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఎస్ఎమ్ఎస్ ద్వారా అలర్ట్‌లు అందించబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అంటే, ఇకపై రూ.100 కంటే తక్కువ చేసే చెల్లింపులపై ఎస్ఎమ్ఎస్‌లు రావు. అలాగే రూ.500 కంటే తక్కువ డిపాజిట్లకు కూడా అలర్ట్‌లు ఉండవని తెలిపింది.