AP: పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు.. విచారణలో బాగంగా ప్రవీణ్ కదలికలకు సంబంధించి మినిట్ టు మినిట్ వీడియోలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న రాజమండ్రి లలితా నగర్‌కు చెందిన నాగమల్లేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. నాగమల్లేష్ ను రాజమండ్రి జైలుకు తరలించారు.