యూపీలోని ముజఫర్ నగర్‌లో ఆదివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగిందిత. బైక్‌పై ఇద్దరు యువకులు వేగంగా ప్రయాణిస్తూ రోడ్డు దాటేందుకు యత్నించారు. అదే సమయంలో ఓ ట్రక్కు అటుగా వెళ్తోంది. అతి వేగం వల్ల బైక్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కింద పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.