ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ పంజాబ్ మహిళలు ఢిల్లీలోని ఆయన ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూటమిగా ఏర్పడి కావాలనే తమపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.