కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లిల్లో ఇటీవల పిడుగుపడి ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు, ప్రజలకు నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు. BRS హయాంలో కులగణన చేశారని.. మళ్లీ చేయాల్సిన అవసరం లేదు' అని అన్నారు.