14 మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తింపు

76చూసినవారు
14 మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తింపు
నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల సమీపంలోని నెందూర్‌-తుల్‌తులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. చీకటి పడే వరకు ఇవి కొనసాగాయి. సాయంత్రానికి 14 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలం వద్ద ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు తదితర 36 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల ఘటనను నారాయణ్‌పూర్‌ ఎస్పీ ప్రభాత్‌కుమార్‌ ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్